వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి మరో అరుదైన రికార్డు సృష్టించింది. గత డిసెంబర్ ఒక్క నెలలో 252 ప్రసవాలు చేసి అక్కడి వైద్య బృందం ఆసుపత్రిని మొదటి స్థానంలో నిలిపారు. 30 పడకల సామర్ధ్యం వున్న ఈ ఆసుపత్రిలో 2017 సంవత్సరంలో1530 ప్రసవాలు, 2018 సంవత్సరంలో2261 ప్రసవాలు జరిగాయి. వైద్యులు, సిబ్బంది ఇరవై నాలుగు గంటలను రోగులకు అందుబాటులో వుంటూ స్థానికుల ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణ లో ఎక్కడ లేని విధంగా వైద్యులు 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేతి నరసింహస్వామి ఆధ్వర్యంలో వైద్య బృందం, సిబ్బంది పనితీరుతో ఆసుపత్రికి సంవత్సర కాలంలో లక్ష వరకు రోగులు వచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది . ఈ ఆసుపత్రిని వంద పడకలు చేస్తే మరింత మంది గర్భిణులు రావడంతో పాటు వైద్య బృందం పెరిగి, వసతులు పెరిగి సిబ్బంది సమకూరడం జరుగుతుందని స్థానికులు కోరిక