మండల కేంద్రమైన అరకులోయ పట్టణంలో ఐటీడీయే పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావు బుధవారం ఉదయం ముమ్మర తనిఖీలు నిర్వహించారు ఈ నెల ఒకటో తేదీ నుండి పర్యాటక కేంద్రం అరకులోయలో ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ ఐటిడిఎ పిఓ బాలాజీ గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అరకులోయ పర్యటనకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుడా ఇక్కడ ప్లాస్టిక్ వినియోగంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అరకులోయ ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆయన ఐటిడిఎ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈ నెల 1తేదీ నుండి ప్లాస్టిక్ వినియోగంపై అధికారులను ద్వారా పీవో తనిఖీలు చేపడుతున్నారు మంగళవారం అరకులోయలో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపారులపై 11500 రూపాయలు జరిమానా విధించారు. మరోవైపు, బుధవారం సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావు స్తానికంగా వున్నా దుకాణాల్లో తిరిగి ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ లో ఆయన ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేసారు. మొదటి హెచ్చరిక కింద దాదాపు 38 వేల రూపాయలు జరిమానా విధించారు. రెండోవసారి ప్లాస్టిక్ వినియోగిస్తూ పట్టుబడితే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి షాపు ముందు తప్పనిసరిగా డస్ట్ బిన్ను ఉపయోగించాలని ఆదేశించారు. ఇకపై పేపర్ సంచులను మాత్రమే వినియోగించాలని ప్లాస్టిక్ ను పూర్తిగా విడిచి పెట్టాలని ఆయన వ్యాపారులకు సూచించారు.