YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు కు వాల్‌మార్ట్ ఆసక్తి..?

Highlights

  •  ఫ్లిప్‌కార్ట్ విలువ 12 బిల్లియన్ డాలర్లు
ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు కు వాల్‌మార్ట్ ఆసక్తి..?

అమెరికా రీటైల్ సంస్థ వాల్‌మార్ట్ భారత ఈ-కామర్స్ దిగ్గజమైన  ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతోంది.ప్లిప్‌కార్ట్‌లో 40 శాతానికి పైగా వాటాల కొనుగోలుకు సంబంధించి వాల్‌మార్ట్ చర్చలు జరుపుతున్నట్లు  తెలుస్తోంది.చర్చలు జరుగుతున్నట్లు రెండు సంస్థల ప్రతినిధులు ధృవీకరించారు. అదే జరిగితే అమెజాన్ పెను సవాల్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ఈబే, టెన్‌సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ కథనాలు ఫ్లిప్‌కార్ట్ ప్రధాన పోటీదారు అమెజాన్ సంస్థ వర్గాల్లో గుబులురేపుతోంది.. 

Related Posts