YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రఫేల్‌ తీర్పును పునఃసమీక్షించాలి తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు

రఫేల్‌ తీర్పును పునఃసమీక్షించాలి              తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు
రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో కేంద్రప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ఈ ఒప్పందం ఫై కేంద్రం తప్పుడు వివరాలను న్యాయస్థానానికి సమర్పించిందని వీరు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.దీనికి సంబందించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గతేడాది డిసెంబరు 14న తుది తీర్పు వెల్లడించింది. రఫేల్‌ ఒప్పందం నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కన్పించలేదని కోర్టు పేర్కొంది. ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని, ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరమేమీ లేదని తెలిపింది. ఈ మేరకు ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.అయితే తీర్పుపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. సుప్రీంతీర్పును భాజపా స్వాగతించగా.. కాంగ్రెస్‌ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేగాక.. ఈ రివ్యూ పిటిషన్‌పై బహిరంగ న్యాయస్థానంలో విచారణ జరపాలని అరుణ్‌శౌరీ, యశ్వంత్‌ సిన్హా తదితరులు కోర్టుకు విన్నవించారు.

Related Posts