YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాముడిపై కాంట్రావర్శీ కామెంట్ రచయితపై కేసు నమోదు

 రాముడిపై కాంట్రావర్శీ కామెంట్  రచయితపై కేసు నమోదు
తాను రాసిన పుస్తకంలో రాముడి దేవుడే కాదన్నందుకు కన్నడ రచయిత, విద్యావేత్త కేఎస్ భగవాన్ చిక్కుల్లో పడ్డారు. ‘రామమందిర యేక బేడ’ అనే పుస్తకాన్ని రాసిస భగవాన్, అసలు రాముడు దేవుడే కాదంటూ చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపుతున్నాయి. రాముడు అసలు దేవుడే కాదు.. ఎందుకంటే సాధారణ మానవుడిలా ఆయన కూడా అనేక సమస్యలతో సతమతమయ్యాడు’ అని తన పుస్తకంలో ప్రస్తావించారు. రామ మందిరం అంశాన్ని ప్రధానంగా తీసుకుని రాసిస ఈ పుస్తకంలో శ్రీరాముడు ఆయన దేవుడే కాదనే అర్థం వచ్చేలా రాయడంతో ఓ హిందుత్వ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు భగవాన్‌పై కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్‌ 295ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. వివాదాస్పద పుస్తకంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో రాముడ్ని తక్కువ చేసి చూపడమే కాదు, మహాత్మా గాంధీ గురించి అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నాయి. కేఎస్ భగవాన్‌పై పోలీసులకు హిందూ జాగరణ్‌ వేదిక మైసూరు జిల్లా అధ్యక్షుడు కె.జగదీశ్‌ హెబ్బర్‌ ఫిర్యాదు చేశారు. హిందుత్వ సంస్థలకు చెందిన కార్యకర్తలు భగవాన్‌ ఇంటి ముందు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. మరోవైపు ఈ అంశంపై ముఖ్యమంత్రి కుమార స్వామి మౌనంగా ఉండటంపై బీజేపీ మండిపడుతోంది. భగవాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఎస్‌.సురేశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘భగవాన్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి రెండే దారులున్నాయి. ఆయన్ను జైలుకు పంపడం లేదా పిచ్చాస్పత్రిలో చేర్పించడం వంటివి చేయాలి’అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, తన పుస్తకంలో మాత్రం వాల్మీకి రామాయణం, భగవద్గీతలో అంశాలను ప్రామాణికంగా తీసుకున్నానని రచయిత అంటున్నారు. దీని మాత్రం హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి

Related Posts