YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్లేబాయ్ తో ఆమీ జాక్సన్ పెళ్లి

ప్లేబాయ్ తో  ఆమీ జాక్సన్ పెళ్లి
‘2.0’ చిత్రంలో రోబొ వెన్నెలగా అలరించిన బాలీవుడ్ సుందరి అమీ జాక్సన్ త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. గత కొన్నాళ్లుగా బ్రిటన్‌కు చెందిన కోటీశ్వరుడు ఫ్రెండ్ జార్ట్ పనాయొటోతో సహజీవనం సాగిస్తున్న ఈ భామ కొత్త సంవత్సరంలో అతడితో ఎంగేజ్మెంట్ కుదుర్చుకుంది. తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌కి తెలియజేస్తూ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది అమీ జాక్సన్. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం వేళ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది అమి. జనవరి 1న జాంబియాలో వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. ‘ఈ ప్రపంచంలో అందరికంటే నన్ను హ్యాపీయెస్ట్‌గా చూడగలిగే వ్యక్తితో కలిసి కొత్త ప్రయాణం మొదలైందని.. లైఫ్‌లో ఇదో హ్యాపీ అడ్వంచర్’ అని తెలిపింది అమి జాక్సన్. అమీ జాక్సన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జార్ట్ పనాయొటో మల్టీ మిలియనీర్ ప్లే బోయ్‌గా ప్రసిద్ధి. ఇతడు యూకేలోనే అత్యంత ధనవంతుడు కావడం విశేషం. బ్రిటీష్ ప్రాపర్టీ డవలపర్ ఆడ్రియాస్ కుమారుడే ఈ జార్ట్ పనాయొటో. వీరికి ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన హోటల్స్ ఉన్నాయి. కాగా.. మొదట్లో స్నేహితులుగా ఉన్న అమీ, జార్ట్‌లు గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇటీవల ఓ ఖరీదైన ఇల్లును కొనుగోలు చేశారు జార్ట్ పనాయొటో. ప్రస్తుతం అమీ, జార్ట్‌లు అదే ఇంట్లో సహజీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రిస్మస్ వేడుకలను సైతం అదే ఇంట్లో జరుపుకున్నారు. ఆ ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది అమీ జాక్సన్. 

Related Posts