YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కార్య సాధకుడు కేసీఆర్

కార్య సాధకుడు కేసీఆర్

 ఓ.. కారణ జన్ముడా.. అరెరె కార్య సాధకుడా అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునే రీతిలో రూపొందించారు.ఈనెల 17 సీఏం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ న్యూస్ ఛానల్ ఈ పాటను తయారు చేయించడం విశేషం. కేసీఆర్ తన పాలనా చతురతతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారంటూ..  కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారనే విధిగా ఈ పాటను రూపొందించారు. ఎస్ ఎస్ రాజేష్ స్వర కల్పనలోని ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యం, నేపధ్య గానం అందించారు.
అరచేతిని అడ్డుగ పెట్టి.. సూర్యుడినే ఆపేశావు.. సూర్యుడు నీవై ఉదయించావు.. అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బర్త్ డే సందర్భంగా అద్భుతమైన  మరో పాటను  ఇంకో టీవీ ఛానల్  తెరకెక్కించింది. లిరిక్స్ కందికొండ రాయగా.. మంగ్లీ తన స్వరంతో అద్భుతంగా పాడారు. ఈ పాటకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిర్మాతగా వ్యవరించారు.

Related Posts