YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అది వెన్నుపోటు కాదు.. వెన్ను దన్ను

అది వెన్నుపోటు కాదు.. వెన్ను దన్ను
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని ‘వెన్నుపోటు’ పాట తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. బుధవారం విజయవాడలో మీడియాతో  మాట్లాడిన శివాజీ వర్మపై విరుచుకుపడ్డారు. వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా తెలియని మనిషి సినిమా తీస్తున్నాడని తనకు వ్యక్తిగతంగా అనిపించిందని ఆయన అన్నారు.
 ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా లక్ష్మీ పార్వతి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. అందులో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో చూపించాలి. కానీ చంద్రబాబు నాయుడు రామారావుని వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఆ రోజున ఆయన(వర్మ) పాట విడుదల చేశారు. అంతేకాక, ఆయన వైఎస్ఆర్సీపీ అని కూడా అంగీకరించాడు. చంద్రబాబు నాయుడి విషయానికొస్తే  రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపినప్పుడు దాని వెనకున్న పరమార్థం వేరు. అలానే చంద్రబాబు నాయుడు కూడా లక్ష్మీపార్వతి, తెలుగుదేశం పార్టీని కబ్జా చేయాలని భావిస్తున్న తరుణంలో యావత్ పార్టీ,   కేసీఆర్తో సహా అంతా కలిసి పార్టీని కాపాడటానికి, రాష్ట్రాన్ని కాపాడటానికి ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పార్టీలో ఉన్న కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉన్నారు. కావాలంటే.. ఆ వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి చూసుకోండని అన్నారు. నిజానికి వైస్రాయ్ హోటల్ దగ్గర చైతన్య రథంపై చెప్పులు విసిరింది కూడా లక్ష్మీ పార్వతికి సంబంధించిన మనిషే. ఆ ఘటనకు నేను ప్రత్యేక్ష సాక్షిని. కాబట్టి అది వెన్నుపోటు.. కాదు వెన్నుదన్ను. ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఓ పార్టీగా ఆవిర్భవించింది. అసలు చంద్రబాబు నాయుడుగారు లేకపోతే  వాజ్పేయ్  రెండో సారి ప్రధానమంత్రి అయ్యేవారు కాదు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవలేదు అని చెప్పి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని గెలిపించారు. కాబట్టి ఇలాంటి వాళ్లు అంతా చెప్పే మాటల కంటే ప్రజల తీర్పు గొప్పది. ఇది నాకు వ్యక్తిగతంగా అనిపించిన విషయం. మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదని శివాజీ అన్నారు.

Related Posts