సంక్రాంతి పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరో 13 ప్రత్యేక ఛార్జీల రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో రెండు మినహా మిగిలినవి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాల నుంచి హైదరాబాద్‌కు పండగ తర్వాత తిరిగి వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని నడుపనున్నవే. కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు ఏడు, నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు మూడు, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ఒకటి.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు రెండు ప్రత్యేక ఛార్జీల రైలు సర్వీసులు తిరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం 13 ప్రత్యేక రైళ్లలో 11 సర్వీసులు భారీ ఛార్జీలుండే సువిధ ప్రత్యేక రైళ్లు కావడం గమనార్హం. వీటిలో టికెట్లు అయిపోయేకొద్దీ ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. గరిష్ఠంగా మూడు రెట్ల అదనపు ఛార్జీలు ఉంటాయి.కాకినాడసికింద్రాబాద్: సువిధ రైళ్లు. 16, 17, 20 తేదీల్లో రెండేసి. 18న ఒకటి. నర్సాపూర్‌సికింద్రాబాద్: (సువిధ) 18, 19, 20 తేదీల్లో ఒక్కోటి.విజయవాడసికింద్రాబాద్: (సువిధ) 17న ఒకటి.సికింద్రాబాద్‌కాకినాడ: ప్రత్యేక ఛార్జీల రైళ్లు. 13, 20 తేదీల్లో ఒక్కోటి.