Highlights
- కేసీఆర్ పుట్టిన రోజు సందర్భగా పుస్తకాలు పంపిణీ
- ఎపి కవిత కృషి ఫలితంగా విద్యార్థులకు భోజనం
- తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్
బంగారు తెలంగాణ నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉందని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు వీజీఎస్ గైడ్స్ మరియు మోడల్ పేపర్స్ కి సంబందించిన పుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్బంగా ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో ఉన్న వారికి పదవ తరగతి చాలా కీలకమన్నారు. ఒక విద్యార్థి ఇంజనీర్ కావాలన్న, డాక్టర్ కావాలి అనుకున్న, చాటెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న వారికీ పునాది బలంగా ఉండాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమీషనర్ గా ఎంపీ కల్వకుంట్ల కవిత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ సంస్థ అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు.. పేద కుటుంబం నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కవిత సహకారంతో మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు విద్యార్థుల తరుపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ తిరుపతి వర్మ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.