YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లంబసింగిలో పడిపోతున్న టెంపరేచర్.

లంబసింగిలో పడిపోతున్న టెంపరేచర్.
 దక్షిణాదిలో అతిశీతల ప్రాంతంగా....ఆంధ్రా కాశ్మీర్ గా...ప్రత్యేక గుర్తింపు పొందిన లంబసింగికి సంబంధించి ఒక సంచలన వాస్తవం వెలుగుచూసింది...పైగా ఆ నిజం కూడా లంబంసింగిలో నమోదవుతున్నాయి.లంబసింగిలో జీరో టెంపరేచర్ నమోదు నిజం కాదా? అసలు లంబసింగిలో ఎప్పుడూ సున్నాడిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదా?...అంటే వినడానికి విచిత్రంగా ఉన్నా ఒక విషయం మాత్రం వాస్తవమట. లంబసింగి...అందుకే దాన్ని ఆంధ్రా కాశ్మీర్ అంటారు...ఎందుకంటే లంబసింగిలో సైతం అక్కడలాగే జీరో డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది... ప్రకృతి అందాలకు సంబంధించి లంబసింగి(అసలు పేరు లమ్మసింగి) గురించి చేసే వర్ణన లంతా నూటికి నూరుపాళ్లు నిజమేనట...కానీ ఒక్క విషయం...ఒకే ఒక్క విషయం...అదీ లంబసింగికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆ విషయం మాత్రం అబద్దమని చెప్పలేరు కాని అలాగని నిజమనీ చెప్పలేమట. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే...లంబసింగిలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీల టెంపరేచర్ కు పడిపోవడం గురించే...అసలు లంబసింగిలో ఇప్పటిదాకా ఎప్పుడైనా సున్నాడిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందో లేదో ఎవరూ అధికారికంగా చెప్పలేదట. అంతే కాదు ఇప్పటివరకు ఉన్నవాతావరణ వ్యవస్థ ప్రకారం అలా చెప్పడం కూడా సాధ్యం కాదట. ఎందుకంటే లంబసింగికి సంబంధించి టెంపరేచర్ నమోదు చేసే అధికారిక సంస్థ గానీ ,వ్యవస్థ గానీ ఏమీ ఇక్కడ లేవట. మరి టెంపరేచర్ లెక్క ఎలా? లంబసింగికి 10 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి సెంటర్ ఉంటుంది. అక్కడ మాత్రం ఒక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. అక్కడ ఆ కేంద్రంలో నమోదయ్యే చింతపల్లికి సంబంధించిన ఉష్ణోగ్రతలనే సుమారుగా మరి కొంచెం తగ్గించి సుమారుగా అంచనా కట్టి లంబసింగి టెంపరేచర్ గా చెప్పేస్తున్నారట. ఫర్ ఎగ్జాంపుల్ చింతపల్లిలో 8 డిగ్రీల టెంపరేచర్ నమోదైతే లంబసింగి చింతపల్లి కంటే ఎగువన ఉంటుంది కాబట్టి అక్కడ మరికొంత చల్లగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు డిగ్రీలు తగ్గించి లంబసింగిలో ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా చెప్పేస్తున్నారట. ఎందుకలా అంటే...మరి లంబసింగి టెంపరేచర్ లెక్క కట్టే అవకాశం లేదు కాబట్టి...అది ఒక అంచనా అంటున్నారట. అలా చెప్పడం కరక్టేనా... నిజానికి శాస్త్రీయంగా అలా చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు వాతావరణ నిపుణులు. ఎందుకంటే...వాస్తవంగా ఒక ప్రదేశం దగ్గర నమోదయ్యే ఉష్ణోగ్రత ఆ ప్రదేశానికే పరిమితం అంటున్నారు. ఆ ప్రాంతానికి దగ్గరగా ఫలానా ప్రాంతం ఉంది...అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి టెంపరేచర్ ఇలా ఉండొచ్చు అనే అంచనాలు అస్సలు శాస్త్రీయ సమ్మతం కాదని వారు తేల్చేస్తున్నారు... అందుకే...లంబసింగిలో జీరో డిగ్రీల టెంపరేచర్ నమోదు కూడా అధికారికం కాదని స్పష్టం చేస్తున్నారు...సో...అదండి మరి లంబసింగి జీరో డిగ్రీల టెంపరేచర్ వెనుకున్న కథ. తొలిసారి...ఎప్పుడంటే... అయితే లంబసింగికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది...పర్యాటకులు ఇక్కడకు పోటెత్తుతోంది...లంబసింగిలో జీరో డిగ్రీల టెంపరేచర్ నమోదు అని మీడియాలో వార్తలు వెలువడినప్పటి నుంచే...అదెప్పుడంటే...తొలిసారిగా 2012 లో ఇక్కడ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందనే ప్రచారం జరుగుతోంది.. ప్రభుత్వం చిన్నచూపు... అయితే లంబసింగిలో జీరో డిగ్రీ టెంపరేచర్ సంగతి అటుంచితే ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నమాట నిజం. అయినప్పటికి ప్రభుత్వం కూడా ఈ ప్రదేశంపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదన్నది కూడా నిజమే. ప్రభుత్వం లేదా పర్యాటక శాఖ ఈ ప్రదేశంపై కొంత దృష్టి పెట్టి అభివృద్ది కోసం కొన్ని చర్యలు చేపడితే చాలు ఇది మంచి టూరిస్ట్ సెంటర్ గా మరింత గుర్తింపు పొందుతుంది. కానీ పర్యాటకులు వెల్లువలా తరలివస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబసింగిలో సరైన వసతి,సదుపాయాలు అటుంచి కనీసం చిన్న హోటళ్లు, రెస్ట్ హౌస్లు లేకపోవడంతో ఇక్కడ ఉన్నంత సేపు ఉండి మళ్లీ చింతపల్లికి మరలి వెళ్లాల్సిందే. 

Related Posts