తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులు నూతన సంవత్సరం సందర్భంగా కోట్ల మద్యాన్ని తాగేశారు. డిసెంబరు 31న రూ. 133 కోట్ల మద్యాన్ని తాగి రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చారు. మాములుగా రోజుకు రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. నూతన సంవత్సరం సందర్భంగా.. సోమవారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 133 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే దాదాపుగా రెండింతల అమ్మకాలు జరిగాయి. అయితే డిసెంబరు చివరి వారంలో రూ.600 కోట్లకు పైగా విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 19.5 కోట్ల మద్యం కొనుగోళ్లు జరిగాయాయని అధికారులు తెలియారు. రంగారెడ్డిలో రూ.15.30 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 18 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.11.90 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.కొత్త సంవత్సరం రోజు ఏపీలో కూడా మందుబాబులు పండుగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రూ. 118 కోట్ల మద్యాన్ని తాగేశారు. ఏపీలో రోజుకు రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. డిసెంబరు 29 నుంచి 31 వరకు మొత్తం రూ. 289 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది.