దేశ ప్రజలను కన్న బిడ్డ ల లాగా చూడాల్సిన ప్రధాని, ఎపి ప్రజలను మేత్రం కళ్లుండీ చూడలేక పోతున్న ధృతరాష్ట్రుడు లాగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఎపి ప్రజలను మోసం చేయడమే కాక, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. డాఫర్ లోఫర్, గజదొంగలు, అవినీతి పరులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు ను తిట్టిస్తూ మోడి పైశాచిక ఆనందాన్ని పొందాడు. చంద్రబాబు ఎపి అభివృద్ధి కి కష్టపడుతుంటే.. సహకరించకుండా సిగ్గు లేకుండా మీ పార్టి నేతలతో తిట్టి స్తారా అని అయన ప్రశ్నించారు. కళ్లు ఉండీ చూడలేని మోడి తీరును నిరసిస్తూ కళ్ల కు గంతలు కట్టుకుని మీడియా సమావేశం నిర్వహిస్తున్నానని అన్నారు. వైయస్ సిఎంగా ఉన్నప్పుడు కోట్ల రూపాయల ను దోచుకున్న గజదొంగ కన్నా లక్ష్మినారాయణ అని ఆరోపించారు. కౌన్సిలర్ గా కూడా గెలవలేని సోము వీర్రాజు మోడికి సూచనలు చేస్తున్నారు. టిడిపి అండతో, చంద్రబాబు ను అడ్డం పెట్టుకుని పదవులు పొందిన మీరా మా అధినేత ను విమర్శించేది. ప్రధానిగా ఉన్న మోడీ ఆస్థాయిని దిగజార్చే విధంగా నిన్న వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు కృషి చేస్తుంటే నిధులు కూడా ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ లో మహా కూటమి ఓటమి చెందిందని సంకలు గుద్దుకుంటున్న మోడి.. బిజేపి గతి ఏమిటో ఆలోచించుకోవాలని అన్నారు. మహా కూటమి ప్రతిపక్షంలో అయినా ఉంది. మీ బిజేపి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కన్నా, జగన్, విజయసాయిరెడ్డి, లు కలిసి చీకటి ఒప్పందాల చేసుకుంటూ చంద్రబాబు పై విమర్శలు చేయడమే పని గా పెట్టుకున్నారు. ప్రపంచంలో ఉన్న 420 లిస్ట్ లో కన్నా ఉన్నారు, 50లక్షలకు ఎమ్మెల్యే సీటును సోము వీర్రాజు అమ్ముకున్నాడు. ఇలాంటి నేతలతో సమావేశం పెట్టి చంద్రబాబు ను తిట్టిస్తూ మోడి పైశాచికత్వాన్ని పొందుతున్నాడని విమర్శించారు. మోడి, జగన్, కేసిఆర్ లు ఎంత మంది కలిసినా చంద్రబాబు ను ఏమీ చేయలేరు.. ఆయనకు ప్రజా బలం ఉంది. నమ్మంబాబూ నిన్ను అంటున్న జగన్, లక్షల కోట్లు దోచుకున్న నిన్ను నమ్మాలా అని నిలదీసారు. రాష్ట్రాన్ని అణగదొక్కుతున్న మోడీని, ఎపి పై విషం చిమ్ముతున్న కేసిఆర్ ను నమ్మాలా. ఓటమి భయంతో వారంతా మతి భ్రమించి చంద్రబాబు పై నోరు పారేసుకుంటున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కష్టం, చేసిన అభివృద్ధి చూసి ప్రజలే గెలిపిస్తారని అన్నారు.