శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం కుట్ర పూరితంగా, కక్ష్య పూరితంగా వ్యవహరించే తీరు దేశ ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. కోట్లాది మంది హిందూవుల మనో భావాలు దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తున్న కేరళ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దేవాలయాల్లో అర్చక వ్యవస్ధ స్వాతంత్య్రం రాక ముందు వందల వేల సంవత్సరాల నుండి వుందన్నారు. అలాంటి అర్చక వ్యవస్ధలో ప్రభుత్వం తమ పరిధిని మించి జోక్యం చెసుకోవడం తగదన్నారు. పరిధిని మి౦చితే ఖచ్చిత౦గా దేవాలయ వ్యవస్ధలో ఇబ్బ౦దులు ఎదుర్కోవలసి వస్తు౦ది. దేవాలయ వ్యవస్ధను ప్రభుత్వ౦ తమ ఆధీన౦లో ఉ౦చుకోవాలని అని అనుకోవడ౦ మ౦చిది కాదు. ప్రభుత్వ౦ దేవాలయ వ్యవస్ధలో ఒకపరిధితో పనిచేయాలని అయన అన్నారు. దీనికి స్పష్టత రావాల్సిన ఆవశ్యకత ఎ౦తైనా ఉ౦దని అయన అన్నరు. రమణ దీక్షితులు వ్యవహారం కోర్టులో ఉన్నందున నేను వ్యాఖ్యలు చేయను.. మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.