ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఆరో వన్డేలో సఫారీ జట్టు 204 పరుగులకు ఆలౌటయింది. దక్షిణాఫ్రికా ఆటగాడు జోండొ 54 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఇతర ఆటగాళ్లు ఫెలుక్వాయో 34, డివిలియర్స్ 30, మర్‌క్రమ్ 24, క్లాసెస్ 22, మోర్కెల్ 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఇక.. భారత్ బౌలర్లలో శార్దూల్ నాలుగు వికెట్లు తీయగా... చాహల్, బుమ్రా రెండు, పాండ్య, కుల్‌దీప్ చెరో వికెట్ తీశారు.అంతకుముందు టాస్‌గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భువనేశ్వర్‌పై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో అతనికి విశ్రాంతినిచ్చి మరో పేసర్ శార్దుల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు విరాట్ వెల్లడించాడు. మరోవైపు చివరి వన్డేలో సఫారీ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న క్రిస్‌మోరీస్, బెహార్డీన్, తాహిర్, జోండో నేటి మ్యాచ్‌లో ఆడుతున్నట్లు కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ తెలిపాడు. నామమాత్రమైన సెంచూరియన్ వన్డేలోనూ గెలిచి తమ ఆధిపత్యం చాటాలని కోహ్లీసేన భావిస్తోంది.