రాఫెల్ కుంభకోణంపై పార్లమెంట్ లో సమాధానాలు ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోతుంది. అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థకు ఎలా కాంట్రాక్ట్ ఎలా కట్టబెడతారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రతను మోడీ తన రాజకీయాల కోసం పణంగా పెట్టారు. మోడీ సర్కారు చేసిన తప్పును సిగ్గులేకుండా సమర్థించుకొంటొంది. మోడీ సర్కారు ఆమాద్మీ సర్కార్ కాదు. అంబానీ, ఆదానీ సర్కార్. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కు అదేశిస్తే తప్పేముందని అయన అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ కుటమిపై నాకు తెలియదని మోడీ అనడం మిలినియం జోక్. మోడీ, కేసీఆర్ ల మధ్య రహస్య ఒప్పందం ఉంది.
తెలంగాణలో ప్రజా కూటమి ఆయిపోయిందని అంటున్న మోడీ, బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన విషయాన్ని మరిచిపోయారా అని అయన అన్నారు. కేసీఆర్ కోసం మోడీ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను బలి ఇచ్చాడు. మోడీకి నైతికత ఉంటే .. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని అయన అన్నారు.