YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అఫ్గానిస్థాన్‌ను పునర్‌ నిర్మాణ చర్యలేవి? ప్రధాని మోదీపై ట్రంప్‌ విమర్శలు

అఫ్గానిస్థాన్‌ను పునర్‌ నిర్మాణ చర్యలేవి?              ప్రధాని మోదీపై ట్రంప్‌ విమర్శలు
ప్రధాని నరేంద్రమోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్‌ను పునర్‌ నిర్మించేందుకు భారత్‌ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. అఫ్గాన్‌లో భారత్‌ నిర్మించిన గ్రంథాలయం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. ట్రంప్‌ తన కేబినెట్‌ సహచరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్థాన్‌ నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ‘మోదీతో సమావేశమైన సమయంలో అఫ్గాన్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అందుకు మేం కృతజ్ఞతలు తెలిపాం. కానీ భారత్‌ నిర్మించే గ్రంథాలయంతో కలిగే ప్రయోజనమేంటి? ఎవరు ఉపయోగిస్తున్నారో కూడా తెలియదు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్లతో పోరాడేందుకు భారత్‌ సహా రష్యా, పాకిస్థాన్‌ వంటి దేశాలు సహకరించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. తాలిబన్లతో శాంతి చర్చలు జరిపేందుకు ఇతర దేశాలు ప్రయత్నించాలని ట్రంప్‌ కోరారు. అఫ్గాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ 2017లో భారత్‌, అఫ్గాన్‌ మధ్య ఒప్పందం జరిగింది. 31 ప్రావిన్స్‌లలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇరిగేషన్‌, తాగునీరు ఇతర రంగాల అభివృద్ధికి సాయం చేస్తామని భారత్‌ తన ఒప్పందంలో పేర్కొంది. దీనిలో భాగంగానే అక్కడి యువత కోసం గ్రంథాలయ ఏర్పాటు చేసింది.

Related Posts