YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నమ్మకం ద్రోహం చేరు

ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నమ్మకం ద్రోహం చేరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నమ్మకం ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ‘‘విభజన తర్వాత లోటు బడ్జెట్‌ ఉంది, దానికి తోడు రాజధాని, పరిశ్రమలు లేవు. రాజధాని శంకుస్థాపనకు పిలిచి పునాది వేయమని ఆహ్వానిస్తే.. మోదీ వచ్చి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారు. రావాల్సింది అడిగితే.. నామీద ఎదురుదాడి చేసి పరిస్థితికి వచ్చారు. ఏటా కేంద్రానికి నాలుగైదు వేల కోట్లు పన్నులు కడుతున్నాం. ఏపీకి చేయూతనిస్తే గుజరాత్‌ రాష్ట్రాన్ని మించిపోతామని మోదీకి భయం. ఈ మాత్రం నిలదొక్కుకున్నామంటే అది అధికారుల కష్టం. దేశం మొత్తం ఎన్డీయే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దేశం మార్పు కోరుతోంది. ఈసారి ఎన్డీయే ఓడిపోవడం ఖాయమన్నారు.రాష్ట్రానికి న్యాయం చేయాలని పార్లమెంట్‌లో పోరాడుతుంటే మన ఎంపీలను ఎన్నోసార్లు సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌లు చేస్తే భయపడేది లేదు. నిన్న మోదీ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ దుష్ట కాంగ్రెస్‌ అంటే, నేను దోస్త్‌ కాంగ్రెస్‌ అంటున్నానని ప్రచారం చేస్తున్నారు.  ప్రత్యేక హోదా అడిగితే మాట మార్చి గారడీలు చేస్తున్నారు. ముగ్గురు మోదీలు ఒక్కటై ఆంధ్రప్రదేశ్‌పై కుట్ర చేస్తున్నారు. మనకు అన్యాయం చేశారనే కేంద్రం, ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. రాష్ట్రానికి కాంగ్రెస్‌ కంటే భాజపానే ఎక్కువ మోసం చేసింది. రఫేల్‌ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా  మోదీ సమాధానం చెప్పరు. రూ.2వేల నోటు వల్ల అవినీతి పెరిగింది గానీ తగ్గలేదు. ప్రధాని స్థాయిలో మోదీ అన్నీ అబద్ధాలు, అసత్యాలే చెబుతున్నారు.  కొందరు బ్యాంకులను మోసం చేసి పారిపోతే  ఇప్పడు పట్టుకొస్తామంటున్నారు.  పోలవరానికి రూ.7వేల కోట్లు ఇచ్చామంటున్నారు.. ఇంకా రూ.74వేల కోట్లు ఇవ్వాలి. పోలవరాన్ని భాజపా కాదు.. కాంగ్రెస్‌ వాళ్లే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు’’ అని చంద్రబాబు వివరించారు.

Related Posts