YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది

టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని చంద్రబాబు చెప్పలేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ప్రధాని మోదీతో పోరాటంలో.. పవన్ కూడా కలిసి వస్తే కాదనేది లేదని మాత్రమే బాబు వ్యాఖ్యానించారని చెప్పారు. జనసేన 175 స్థానాల్లో పోటీచేస్తే టీడీపీకి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు జనసేనతో పొత్తు కోసం ఎదురు చూస్తుందని సీపీఐ నేత నారాయణ మాట్లాడటం సరికాదన్నారు. గురువారం విజయవాడలో మాట్లాడిన వెంకన్న.. తాజా రాజకీయాలపై స్పందించారు. అలాగే బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. కళ్లకు గంతలు కట్టుకొని మోడీ కళ్లుండి చూడలేకపోతున్నారంటూ నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబును తిట్టిస్తూ మోదీ పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు బుద్ధా. టీడీపీ అండతో పదవులు పొందిన వారు కూడా బాబును విమర్శించడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రధాని మోదీ గుంటూరు సభను రద్దు చేసుకున్నారని.. చీటర్లు, గజదొంగలతో తిట్టుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో వందల కోట్లు దోచుకున్న కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కౌన్సిలర్, ఎంపీగా పోటీ చేసి 6 వేల ఓట్లు సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ప్రధానిని డైరెక్ట్‌ చేస్తున్నారంటూ పంచ్ విసిరారు. ఏపీ బీజేపీలో ఉన్న మొత్తం నేతలు.. ఒక గ్రామంలో ఉన్న టీడీపీ కేడర్ అంత మంది ఉండరని సెటైర్ పేల్చారు. సోము వీర్రాజు 50 లక్షలకు బీజేపీ టిక్కెట్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ, జగన్‌, విజయసాయిరెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు వెంకన్న. కన్నా పగలు బీజేపీ ముసుగులో.. రాత్రి విజయసాయిరెడ్డితో మీటింగులు పెడతున్నారని ఆరోపించారు. మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసినా చంద్రబాబును ఏమీ చేయలేరని.. లక్షల కోట్లు దోచుకున్న జగన్‌ని నమ్మాలా.. రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబును నమ్మాలా అంటూ ప్రశ్నించారు

Related Posts