YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సహజీవనం చేస్తూ శారీరక సంబంధం లైంగికదాడి కాదు: సుప్రీంకోర్టు

సహజీవనం చేస్తూ శారీరక సంబంధం లైంగికదాడి కాదు: సుప్రీంకోర్టు
సహజీవనం చేస్తూ శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడు.. మహిళను పెండ్లి చేసుకోనప్పటికీ, లైంగికదాడి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ నర్సు, డాక్టర్ గతంలో సహజీవనం చేశారు. వేరే మహిళను డాక్టర్ పెండ్లి చేసుకోగా కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డాక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించగా జస్టిస్ ఏకే సిక్రి, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. లైంగికదాడికి, పరస్పర సమ్మతితో కూడిన శారీరక సంబంధానికి మధ్య స్పష్టమైన గీత ఉన్నది. ఓ వ్యక్తి నిజంగా ఆమెను పెండ్లి చేసుకోవాలనుకున్నాడా, లేక తన లైంగికవాంఛ తీర్చుకోవడానికి తప్పుడు హామీ ఇచ్చాడా. ఇరువురు ఏకాభిప్రాయంతోనే సహజీవనం చేస్తున్నారా అన్న విషయాన్ని కోర్టు స్పష్టంగా పరిశీలిస్తుంది. ఇద్దరు పరస్పర సమ్మతితో కూడిన శారీరక సంబంధం లైంగికదాడి కిందికి రాదు అని ధర్మాసనం పేర్కొంది. లైంగికవాంఛ తీర్చుకొని దురుద్దేశంతోనే పెండ్లి చేసుకోకుంటే లైంగికదాడేనని స్పష్టం చేసింది.

Related Posts