YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనం రామనారాయణ.... పై టీడీపీ గురి

ఆనం రామనారాయణ.... పై టీడీపీ గురి
అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో పోటీ చేయలేదు. పోటీ చేయకపోతే ఇక గెలిచేది ఎక్కడ అనుకుంటున్నారా? అవును నిజమే. ఇప్పటి వరకూ పోటీ చేయని స్థానంలో తమ పట్టును నిలుపుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకు వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తన వ్యూహం మార్చింది. నిన్న మొన్నటి వరకూ అక్కడ విన్పించిన పేర్లు కనుమరుగవుతున్నాయి. కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నడూ పోటీ చేయలేదు. పొత్తుల్లో భాగంగా ఈ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకూ మిత్రపక్షాలకు కేటాయిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచీ ఇక్కడ పోటీచేయకపోయినా టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. పొత్తుల్లో భాగంగా పోటీ చేయకపోవడంతో నేతలు అప్పటికప్పుడు ఎన్నికల ముందు పుట్టుకొస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బలంగా ఉన్నారు.నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యలపై స్పందిస్తూ ఉండటంతో కోటంరెడ్డిపై గెలుపు అంత సులువు కాదన్న సంగతి టీడీపీ అధిష్టానానికి తెలియంది కాదు.నెల్లూరు రూరల్ నుంచి మంత్రి నారాయణను రంగంలోకి దింపుదామనుకున్నారు. తొలుత ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుకూడా విన్పించింది. అయితే ఆయన తాను పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. ఒకదశలో మంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా విన్పించింది. నిన్న మొన్నటి వరకూ నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేరు కూడా పరిశీలనలో ఉందన్నారు. తాజాగా కోవూరుఎమ్మెల్యే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేరుప్రముఖంగా విన్పిస్తోంది. ఆయనకు కోవూరు నియోజకవర్గంలో సొంత పార్టీలోనే అసమ్మతి ఉండటంతో ఆయనను కోవూరు నుంచి నెల్లూరు రూరల్ కు షిఫ్ట్ చేయాలని భావించారు.వీరందరినీ పక్కన పెట్టి ఇప్పుడు ఆనం కుటుంబంపై కన్ను పడింది. ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికే వైసీపీలో ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి నెల్లూరు రూరల్ టిక్కెట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నట్లుతెలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ లో అత్యధిక ఓట్లను సాధించారు. రఘువీరారెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు తెచ్చుకుంది ఏపీలో ఆనం మాత్రమే కావడం విశేషం.ఇప్పటికే ఆనం విజయకుమార్ రెడ్డితో ఆదాల ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.ఆనం వస్తే నెల్లూరు రూరల్ టిక్కెట్ గ్యారంటీ అని టీడీపీ అధిష్టానంచెప్పేసిందంట. మొత్తం మీద ఆనంకు వేసిన గాలం పనిచేస్తుందా? లేదా? అన్నదిచూడాల్సి ఉంది.

Related Posts