ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 622 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. క్రీజులో పాతుకుపోయిన రిషబ్ పంత్ 159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు పంత్, జడేజాలు కలిసి ఆసీస్ బౌలర్లకు చుక్కులు చూపిస్తూ విరుచుకుపడ్డారు. ఓవర్ కు 7 పరుగులకు పైగా రన్ రేట్ తో స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టించారు. దీంతో స్కోర్ చూస్తుండగానే 600 పరుగులు దాటేసింది. మయాంక్ అగర్వాల్ 77, పుజారా 193, కోహ్లీ 23, రహానే 18, హనుమ విహారి 42, రిషబ్ పంత్ 159, జడేజా 81 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ కు 4 వికెట్లు దక్కగా, హాజిల్ వుడ్ 2, స్టార్క్ 1 వికెట్ పడగొట్టారు.Learnmore