జన్మభూమి-మా వూరు 3వ రోజు నిర్వహణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత రెండు రోజుల జన్మభూమి గ్రామసభల్లో ప్రజా స్పందన బాగుంది. ఇదే స్ఫూర్తి ఇకపై కూడా కొనసాగించాలి. పరిపాలనలో పారదర్శకతకు, ప్రజాభిప్రాయానికి జన్మభూమి గొప్ప వేదిక అని అన్నారు. వినూత్న ఆలోచనలు,నూతన ఆవిష్కరణలకు జన్మభూమి కేంద్రం. మీ ఊరికి ఏం కావాలి..? మీ వార్డులో ఇంకా ఏం చేయాలి..? ప్రజలనుంచే అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. అభివృద్ధి ప్రణాళికలను ఖరారు చేస్తున్నాం. నిర్దిష్టమైన కార్యాచరణ చేపడుతున్నాం. ప్రజాసేవకు జన్మభూమి అద్భుత అవకాశం. ప్రజల్లో మమేకం అయ్యే సదవకాశం. దీనిని ప్రజాప్రతినిధులు, అధికారులు అంది పుచ్చుకోవాలి. సులభతర వాణిజ్యంలో ఏపి దేశంలోనే నెంబర్ వన్ గా వచ్చిందని అన్నారు. లీక్వాన్ యూ స్కూల్ సర్వే వెల్లడించింది. ఇదే సర్వేలో గత ఏడాది 5వ స్థానంలో ఉన్నాం. ఈ ఏడాది నెంబర్ వన్ గా వచ్చామని అన్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ సమన్వయంగా పనిచేయాలి. నిన్న 1,05,000మందికి వైద్యశిబిరాల్లో చికిత్స అందించారు. 1,90,668మంది పశువులకు వెటర్నరీ క్యాంపుల్లో చికిత్స జరిపారు. జన్మభూమిపై ఓవరాల్ శాటిస్ ఫాక్షన్ 79% ప్రజల్లో ఉంది. వైద్యశిబిరాల పట్ల ప్రజల్లో 72% సంతృప్తి బాగుంది. గ్రామసభల్లో చర్చ అర్ధం అయ్యిందని 89% అన్నారు. ఆటల పోటీల పట్ల 62.5% మంది, సాంస్కృతిక పోటిల నిర్వహణపై 63.53% సంతృప్తి ఉంది. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించాలి. వేసవికి ముందే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలి. జన్మభూమిలో ఆనందంగా పనిచేస్తున్నారా అని అధికారులకు ప్రశ్నించారు. 98% జన్మభూమిలో ఆనందంగా పనిచేస్తున్నామని చెప్పారు. అదే సంతోషం,సంతృప్తి ప్రజల్లో కూడా రావాలని చంద్రబాబు అన్నారు. Learnmore