విశాఖపట్నంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన కోడి కత్తి దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. జగన్పై కత్తి దాడి కేసును ఏపీ హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) అప్పగించింది. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకు బదిలీ చేయాలని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున కోర్టులో విచారణను జాతీయ సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసారు. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారవుతాయని పిటిషనర్ వాదించారు. ఈ కేసును విమానయాన చట్టాల ప్రకారం రిజిస్టర్ చేసి, సెక్షన్ 3 (ఏ) కింద నమోదు చేయాలని పిటిషన్ దారు కోర్టును కోరారు. . పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు మాత్రమే నిందితుడని, వెనుక మరెవరూ లేరని విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించిన రెండు రోజుల్లోనే కోర్టు ఈ నిర్ణయం వెలువడింది. Learnmore