వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా.. తొలి సెషన్ నుంచే దూకుడు పెంచాడు. పేసర్ల బౌలింగ్‌లో ఫుల్ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే.. 39 వ్యక్తిగత స్కోరుతో క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (42: 96 బంతుల్లో 5x4) మాత్రం మరో మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్పిన్నర్ లయన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ కోసం విహారి ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి షార్ట్‌లెగ్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. అక్కడే ఉన్న ఫీల్డర్ మార్నస్ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ రాకతో భారత్ ఇన్నింగ్స్‌కి మరింత ఊపు వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈజోడీ ఎడాపెడా బౌండరీలు బాదేసింది. ఈ క్రమంలో ఆరో వికెట్‌కి కీలకమైన 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే.. జట్టు స్కోరు 418 వద్ద పుజారా ఔటవగా.. అనంతరం వచ్చిన జడేజా వన్డే తరహాలో హిట్టింగ్ చేసేశాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా.. జడేజా, రిషబ్ పంత్ దూకుడు పెంచడంతో.. స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దాదాపు 37 ఓవర్ల పాటు కంగారూలకి వికెట్ ఇవ్వకుండా క్రీజులో నిలిచిన ఈ జోడీ.. ఏడో వికెట్‌కి అభేద్యంగా 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.Learnmore