YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండు వేల నోటుపై నిర్ణయం తీసుకోలేదు

రెండు వేల నోటుపై నిర్ణయం తీసుకోలేదు
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పందిచారు. రూ.2,000 నోట్ల ముద్రణకు సంబంధించి ఇటీవల కాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వ్యవస్థలో కావాల్సిన దాని కన్నా ఎక్కువగానే రూ.2,000 నోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రూ.2 వేల నోట్ల ముద్ర‌ణ‌ నిలిపివేత అంశంపై ఆయ‌న నేరుగా స‌మాధానం ఇవ్వ‌లేదు. వ్యవస్థలో పెద్ద నోట్ల చెలామణిని క్రమంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల ముద్రణను నిలిచివేసినట్లు గురువారం జాతీయ మీడియా పేర్కొంది. అక్రమ ఆస్తులకు, పన్ను ఎగవేతలకు, మనీ లాండరింగ్‌ వంటి వాటికి రూ.2,000 నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని తెలిపింది. అయితే రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపివేత అంశంపై రిజర్వు బ్యాంకు స్పందించలేదు. ప్రధాని మోదీ నల్లధనాన్నిఅరికట్టేందుకు 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. 2018 మార్చి నాటికి వ్యవస్థలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.18.03 లక్షల కోట్లు. ఇందులో 37 శాతం (రూ.6.73 లక్షల కోట్లు) రూ.2,000 నోట్లు ఉండగా, 43 శాతం (రూ.7.73 లక్షల కోట్లు) రూ.500 నోట్లు ఉన్నాయి. మిగతా మొత్తం ఇతర నోట్ల రూపంలో ఉంది.

Related Posts