YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో చేరతా తప్పేంటీ

 టీడీపీలో చేరతా తప్పేంటీ
ఎట్టకేలకు ముసుగు తొలగించుకున్నారు నటుడు శివాజీ. గత కొన్నాళ్లుగా ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో బీజేపీ, వైసీపీ పార్టీలపై విమర్శలు సంధిస్తూ.. అధికార పార్టీపైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపైన ప్రశంసలు కురిపిస్తున్న నటుడు శివాజీ ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరుతారా శివాజీ గారూ.. అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు సూటిగా కుండబద్దలు కొట్టే సమాధానం ఇచ్చారు. ‘నాకు టీడీపీలో జాయిన్ అయ్యే హక్కు ఉంది. ఏ.. చేరకూడదా టీడీపీలో.. అందులో తప్పేం ఉంది’ అన్నారు ఆపరేషన్ గరుడ శివాజీ. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందన్నారు శివాజీ. నేను సమస్యలపై పోరాడుతున్నాను కాని టీడీపీ ప్రభుత్వం కోసం పనిచేయడం లేదన్నారు. ఇది సపోర్ట్ చేయడం కాదన్నారు. ‘నేను ప్రజల కోసం పోరాడుతున్నా.. అసెంబ్లీలో అధ్యక్షా అనే హక్కులేదా? ఏపీలో ప్రతిపక్షం ఉండి కూడా వారి పాత్రను సమర్ధవంతంగా నిర్వహించలేదు. ఆ పాత్రను నేను పోషించా. ఎన్నో సమస్యలపై పోరాడా.. నేను రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? టైం వస్తే పాలిటిక్స్‌లోకి వస్తా’ అంటూ క్లారిటీ ఇచ్చారు నటుడు శివాజీ. మొత్తానికి ‘ఆపరేషన్ గరుడ’తో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన శివాజీ పొలిటికల్ ఎంట్రీపై మనసులో మాటను బయటపెట్టేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నుండి ఫోన్ రావడమే తరువాయి.. వెళ్లి పసుపు కండువా కప్పుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే శివాజీ చేరికతో ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఆరోపణలకు బలం చేకూరింది. ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో నటుడు శివాజీని వెనుకుండి నడిపిస్తున్నది టీడీపీనే అంటూ వైసీపీ, బీజేపీ గతంతో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Related Posts