Highlights
- ఫిబ్రవరి 18న జననం
ఆ ఇద్దరే 'శ్రీ రామకృష్ణులు'
ఫిబ్రవరి 18న జననం
“భగవాన్ శ్రీ రామకృష్ణులు అవతార వరిష్ఠులు” అని స్వామీ వివేకానంద అనేవారు. తమను గురించి స్వయముగా శ్రీ రామకృష్ణులే “ఎవరైతే రాముడిగా, కృష్ణుడిగా అవతరించారో, ఆ ఇద్దరూ ఇప్పుడు శ్రీ రామకృష్ణులుగా జన్మించారు” అని స్పష్టం చేసారు. బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామములో 1836వ సంవత్సరం ఫిబ్రవరి 18న (ఫాల్గుణ శుక్ల విదియ, బుధవారం పూర్వాభాద్ర నక్షత్ర యుక్త కుంభలగ్నములో) శ్రీ రామకృష్ణులవారు ఒక పేద బ్రాహ్మణ కుటుంబములో క్షుదీరామ్ చటోపాధ్యాయ, చంద్రమణీ దేవి దంపతులకు (గదాధర్ అనే నామముతో) జన్మించారు. రామకృష్ణులు 1855వ సంవత్సరములో కలకత్తా దక్షిణేశ్వరములో రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయములో ప్రధానార్చకునిగా చేరారు. శ్రీ రామకృష్ణుల జననానికి ముందే ఈ పుణ్య దంపతులు తమకు పుట్టబోయే కుమారుని దివ్యత్వాన్ని సూచించే అనేక దివ్యానుభూతులను పొందారట..తాను పూజిస్తున్న కాళికాదేవి తనకు దర్శనమివ్వలేదని ఎంతో పరితాపం చెందిన ఆయన ప్రతిరోజూ దుఃచించేవారు, చివరకు ఒకరోజు గర్భాలయములో ఒక ఖడ్గముతో జీవితాన్ని అంతం చేసుకొనుటకు ప్రయత్నించగా అకస్మాత్తుగా జగజ్జనని ఆయనకు సాక్షాత్కరించింది. “మీరు దేవుడిని చూశారా?” అని అందరనూ ప్రశ్నించే స్వామి వివేకానందకు ఈయన వద్దే సమాధానం దొరికింది. “నిన్ను ఇప్పుడు ఎంత స్పష్టముగా చూస్తున్నానో దైవాన్ని కూడా అంతే స్పష్టముగా చూశాను” అని వివేకానందకు సమాధానం ఇచ్చారు శ్రీ రామకృష్ణులవారు. ఆయనలోని శక్తిని పసిగట్టిన వివేకానంద “గుప్పెడు మట్టిలో నుంచే నాలాంటి లక్షలాది వివేకానందుల్ని తయారు చేయగలరు నా గురుదేవులు” అని వినయముగా ప్రకటించారు
జై రామకృష్ణ! జై జై రామకృష్ణ!