శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన అంశంపై .. కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ తమ ఎంపీలకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. ఇవాళ పార్లమెంట్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని భావించారు. కానీ సోనియా గాంధీ ఆ ఎంపీలను అలా చేయకుండా నివారించారు. కేరళలో జరుగుతున్న బ్లాక్ డే ఆందోళనలకు నిజానికి ఎంపీలు సంఘీభావం తెలుపాలని నిర్ణయించుకున్నారు. కానీ సోనియా ఆ అంశంపై ఓ స్పష్టమైన వార్నింగ్ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న ధ్యేయంతో ఉందని, అందుకే పార్లమెంట్‌లో అలాంటి నిరసన వద్దు అని తమ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరసనలు కేవలం కేరళ రాష్ర్టానికి పరిమితం చేయాలని సోనియా తన ఆదేశాల్లో ఆ పార్టీ ఎంపీలకు క్లియర్ చేశారు. అయితే శబరిమల అంశంపై ఆర్డినెన్స్ తేవాలన్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతే తీసుకుంటామని కేపీసీసీ ప్రెసిడెంట్ ముల్లపల్లి రామచంద్రన్ తెలిపారు