మహిళ రిజర్వేషన్ బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరుగింది. మహిళ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని పలు పార్టీలు కోరాయి. ప్రస్తుతం ఉన్న బిల్లు పట్టణ, సంపన్న మహిళలకు మాత్రమే సానుకూలంగా ఉందని, కొన్ని మార్పులు చేసి గ్రామీణ మహిళలకు న్యాయం చేయాలని ఎస్పీ ఎంపీ జయాబాదురి కోరారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ఎంపీ సీతా మహాలక్ష్మి స్పష్టం చేశారు. చట్టంతో సంబంధం లేకుండా పశ్చిమబెంగాల్‌లో మహిళ రిజర్వేషన్లను మమతా బెనర్జీ అమలు చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు.