రమ్యకృష్ణ.. సౌత్ఇండియా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన కథానాయిక. ఆమె నటనతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించారు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, బాషలలో 200 కు పైగా చిత్రాలు చేసారు. రమ్యకృష్ణ.. రజనీకాంత్ జోడిగా వచ్చిన 'నరసింహ' చిత్రంలో ఆమె చేసిన నటనతో సూపర్ స్టార్ ను సైతం మెప్పించారు. మరోవైపు తాజాగా వచ్చిన 'బాహుబలి' చిత్రంతో ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో ఆమె పోషించిన 'రాజమాత' పాత్రకు ఎన్నో అవార్డులు వరించాయి. బాహుబలి చిత్రంలో ఆమె నటన ముందు మిగిలిన నటి నటులు చిన్నబోయారు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు.. ఆటువంటి ఆమెకు ప్రస్తుతం తెలుగు లో సరైన పాత్రలు పడట్లేదు. ఈ మధ్య వచ్చిన 'శైలజరెడ్డి అల్లుడు' చిత్రం మినహా నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె కనిపించట్లేదు. మన దర్శక, నిర్మాతలు కారెక్టర్ ఆర్టిస్టులను పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు తప్ప.. మన దగ్గర ఉన్న ప్రతిభను ప్రోత్సహించరు. ఇప్పటికైనా మన దర్శకులు, రచయితలు వారి ఆలోచన సరళి మార్చుకుని.. రమ్యకృష్ణ వంటి మేటి నటులకి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను రాయాలని సినిమా ప్రేముకుల కోరిక. ఆమె నుంచి మరో బాహుబలి, అల్లరి ప్రియుడు, చంద్రలేఖ లాంటి చిత్రాలు కోసం ఎదురుచూస్తున్నారు.