YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాలుగేళ్లలో ఏపీకి కొత్తగా 28 రైళ్లు

నాలుగేళ్లలో ఏపీకి కొత్తగా 28 రైళ్లు
ఆంధ్రప్రదేశ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ గడిచిన నాలుగేళ్లలో ప్రాధాన్యత ఇచ్చింది. అనేక కొత్త రైళ్ల ప్రారంభం, అదనంగా హాల్ట్‌లు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఏపీ ప్రజలకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేసిన ప్రకటనలో తెలిపారు. 2014-2018 సంవత్సరాల మధ్య కొత్తగా విశాఖ-న్యూఢిల్లీ- విశాఖ, సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం విజయవాడ - సికిందరాబాద్‌ల మధ్య ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-్ధర్మవరం మధ్య ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్, తిరుపతి- విశాఖ మధ్య ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. తిరుపతి-జమ్ముతావి మధ్య ఒక రైలును, కాకినాడ- రాయచూర్, కాకినాడ-కర్నూల్ మధ్య బై వీక్లీ రైళ్లను ప్రారంభించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ రైళ్లకు 1300 అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా 458 ప్రత్యేక రైళ్లను, 3000 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు. కర్నూల్‌లో జరిగిన మస్లింల సదస్సుకు 15 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.11 కొత్త రైళ్లను ప్రారంభించగా, మరో 18 రైళ్లు ఏపీ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వివిధ రైళ్లకు రాష్ట్రంలో 60 స్టేషన్లలో కొత్తగా హాల్ట్‌లు ఇచ్చారు. ఏపీ నుంచి, ఏపీ మీదుగా వెళ్తున్న 16 రైళ్లను వివిధ ప్రాంతాలకు పొడిగించారు.

Related Posts