Highlights
- కాళరాత్రి అయింది
మెక్సికోలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం వచ్చింది.రాత్రంతా నిద్రలేకుండా చాలా వరకు రోడ్లమీదనే గడపాల్సి వచ్చింది. నగరానికి 200 మైళ్ల దూరంలోని దక్షిణ పసిఫిక్ తీరంలో ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి జనాలు రోడ్ల మీదికి పరుగులు తీశారు. రాత్రంతా నిద్రలేకుండా చాలా వరకు రోడ్లమీదనే గడపాల్సి వచ్చింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్లు తెలుస్తోంది.
ఈ భూకంపం దాటికి పలు ఇళ్లు, వాహనాలు కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ఓక్సాకా రాష్ట్రంలోని పినోటేపా నసియోనల్ పట్టణంలో తీవ్ర ప్రభావం చూపింది. కాగా గత సెప్టెంబర్‌లో మెక్సికోలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.