పొగమంచు దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కమ్మేయడంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. మంచు దుప్పటిలా ఏర్పడటంతో విమానాలే కాదు రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగు దేశీయ విమానాలు, మరో ఐదు అంతర్జాతీయ విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎస్ జి 8194 స్పైస్ జెట్ విమానం 44 నిమిషాల పాటు ఆలస్యమైంది. బెంగళూరు నుంచి రావాల్సిన ఇండిగో విమానం 55నిమిషాలు, ఇండోర్ -ఢిల్లీ స్పైస్ జెట్ విమానం 55 నిమిషాలు, వారణాసి నుంచి రావాల్సిన విమానం 50 నిమిషాల పాటు ఆలస్యమయ్యాయి. దట్టమైన పొగమంచు ప్రభావం వల్ల కువైట్ నుంచి రావాల్సిన జజీరా ఎయిర్ వేస్ విమానం, ప్యారిస్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం మూడు గంటలు ఆలస్యం అయ్యాయి. మరోవైపు, ఉత్తరాదిలో రైళ్లు కుడా మంచు బారిన పడ్డాయి. దాదాపు 55 రైళ్లను రద్దుచేసారు. మరో 25 రైళ్లు పాక్షికంగాను, 11 రైళ్లు తాత్కలింగా రద్దు అయ్యాయి.