YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధిక దొంగల అడ్డాగా ఏపీ

ఆర్ధిక దొంగల అడ్డాగా ఏపీ
చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి నాలుగేళ్లలో ఎన్నిచేయాలో అన్ని చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కూడా గౌరవించడం అంటున్నారంటే చంద్రబాబును ఏమనాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. దొంగల్ని ఆర్దిక నేరగాళ్లను కాపాడే అడ్డగా ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు మార్చేశారు. చంద్రబాబు హిట్లర్ లా నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదు..మహిళను కాకినాడలో పట్టుకుని ఫినిష్ చేస్తానని గూండాలా బెదిరించారని ఆరోపించారు. అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని బెదిరించేవారు. కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో జగన్ ను చంపేస్తే  నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారని ఆమె ఆరోపించారు. వంద  శాతం హత్యాయత్నం మీరే చేయించారన్నట్లుగా మీ మాటలు చెబుతున్నాయి. ఆపరేషన్ గరుడ అని సినిమాలు లేని శివాజి అనే నటుడి చేత చెప్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు శివాజిని ఎందుకు విచారించలేదని అన్నారు. ఎన్ ఐ ఏకి ఇవ్వడానికి నిందితుడు శ్రీనివాస్ కు లేని బాద చంద్రబాబుకు లోకేష్ కు ఎందుకు. రెస్టారెండ్ ఓనర్ హర్షవర్దన్ చౌదరి.ఆ రెస్టారెంట్ ను మీరే ప్రారంభించారు.  దాడికి ఉపయోగించినకత్తి ఎంతో కాలంగా అక్కడ ఉంచారు. శ్రీనివాస్ కధలు రాస్తున్నడాని మీ ఛానల్స్ లో డ్రామాలు  మీకు బాధ లేనపుడు ఆ కేసును ఎన్ ఐ ఏకి అప్పగించాలని అన్నారు. ఎన్ ఐ ఏకి కేసు అప్పగించాలని ఆ అధికారులు కోరితే రాష్ర్ట పోలీసులు సహకరించడం లేదంట. హత్యాయత్నం వెనక ఉన్న వారు హర్షవర్దన్ చౌదరిగాని,శివాజి చౌదరిగాని అందర్ని బయటకు లాగాలి. వైయస్ జగన్ ,బిజేపితో కలసి కుట్ర చేస్తున్నారంటారు. బిజేపితో కలసి ఎన్నికలకు వెళ్లింది ఎవరు.ప్రభుత్వంలో ఇద్దరు కలసి పనిచేసింది మీరు కాదా? లోక్ సభలో రాజ్ నాధ్ సింగ్ చంద్రబాబు ఎప్పటికి మా మిత్రుడే అని లోక్ సభలో చెప్పారు. మోదికి వంగివంగి నమస్కారాలు పెడుతోంది జగన్ కాదు చంద్రబాబే. తద్వారా తెలుగువారి పరువు తీసింది నీవని విమర్శించారు. బిజేపితో లాలూచి పడింది చంద్రబాబే.మోదికి ఊడిగం చేస్తోంది చంద్రబాబే. -ఏపిలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బిజేపిపై బురద జల్లి బయటకు వెళ్లడం మళ్లీ అదికారం కోసం బిజేపితో పొత్తు పెట్టుకుంది మీరు కాదా అని అన్నారు. మహారాష్ర్ట బిజేపి మంత్రి భార్యను టిటిడి బోర్డు మెంబర్ చేసింది నీవు కాదా? రేపు ఏమైనా కేసులు వస్తే ఆయనతో పనిచేయించుకోవడానికేనా? కేంద్రంపై యుధ్దం అని చెప్పి నీతి అయోగ్ మీటింగ్ కు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టింది నీవు కాదా? ఎన్టీఆర్ బయోపిక్ కు క్లాప్ కొట్టింది ఎవరు వెంకయ్యనాయుడు కాదా? కర్నాటక ఎన్నికలయ్యాక నన్ను అరెస్ట్ చేయబోతున్నారని మీరు నన్ను రక్షించుకోవాలని ప్రజలను కోరలేదా? ఈ రోజు వరకు నిన్ను అరెస్ట్ చేయలేదు అంటే అర్దం ఏంటి? లాలూచి కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. నీవు శంకరర్రావుతో ఎర్రన్నాయుడుతో కుమ్మక్కై కేసులు పెట్టించినా ధైర్యం గా ఎదుర్కోంటుంది  జగన్ . కిడారి సర్వేశ్వరరావును హత్య చేస్తే ఎన్ ఐ ఏ కి అప్పగించింది మీరు కాదా అది సమాఖ్యా స్పూర్తికి విరుద్దం కాదా అని అడిగారు. ఎంఎల్ ఏను రక్షించుకోలేని చేతకాని దద్దమ్మవి. కిడారి సర్వేశ్వరరావు కేసును బదిలి చేసినట్టే  జగన్ కేసు ఎందుకు ఎన్ ఐ ఏకి ఇవ్వడం లేదు. శాంతిభద్రతలు రాష్ర్టపరిదిలోనివి అంటున్నారు.మరి నీ చుట్టు ఉన్న జడ్ కేటగిరి భద్రత కేంద్రం కల్పించిందే కదా. వారిని నీ చుట్టు ఎందుకు ఉంచుకుంటున్నావు.వారిని పంపించేయలని అన్నారు. చంద్రబాబు చెప్పేది శ్రీరంగనీతులు చేసే పనులు ఎలా ఉన్నాయో చూడండి. అసెంబ్లీ వ్యవస్దల్ని నిర్వీర్యం చేస్తూ 23 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలను కొనుగోలు చేసి వారిలో నలుగుర్ని మంత్రులుగా చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు వెళ్లారు. చంద్రబాబుకు,ఆయన బినామిలపై కత్తులు గండ్రగొడ్డళ్లు వేలాడుతున్నాయని అన్నారు.

Related Posts