YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం, - ఉప ముఖ్యమంత్రి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం, - ఉప ముఖ్యమంత్రి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖా మంత్రి కే.ఈ కృష్ణమూర్తి అన్నారు.  శనివారం ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో జరిగిన ఆరవ విడత జన్మభూమి - మావూరు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ  ప్రజల సంక్షేమార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.  రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో ఉన్న నవ్యాంధ్ర ప్రదేశ్ ను ఒక వైపు  అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధికి,  మరో వైపు ప్రజల సంక్షేమాభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రే నన్నారు.  కేంద్ర ప్రభుత్వం సహకారం అందించక పోయినా రాష్టాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.  ఇంకా రేషన్ కార్డులు, పక్కా గృహాలు, పెన్షన్లు రాని వారుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.  ఈ దరఖాస్తులను పరిశీలించి త్వరలో వాటిని మంజూరు చేస్తామని చెప్పారు.  దివంగత ముఖ్యమంత్రి ఎన్. టి.ఆర్ నుంచి మహిళలంటే మా ప్రభుత్వానికి అత్యంత గౌరవం అన్నారు. అందుకే మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామన్నారు.  తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.  జలదుర్గం గ్రామాన్ని అన్ని మౌలిక వసతులను కల్పిస్తామన్నారు.  125 పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.  చంద్రన్న పెళ్లి కానుక పథకంలో నిరుపేదలు పెళ్లికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే పెళ్లి నాటికి ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు.  చంద్రన్న భీమా కింద సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు.  నిరుద్యోగులకు నెలకు రూ.1000 లు నిరుద్యోగ భృతిని ఇస్తున్నామన్నారు.  పుట్టినప్పటినుంచి మహాప్రస్థానం వరకు ప్రతి వ్యక్తికి ఎదో ఒక పథకం ద్వారా లబ్దిని చేకూరుస్తున్నామన్నారు. ఎన్. టి.ఆర్  ఆరోగ్య పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు.  ప్రకృతి సేద్యం చేస్తే అధిక ఆదాయం వస్తుందని చెప్పారు.  ఆదరణ పథకంలో పనిముట్లను 10 శాతం చెల్లించి తీసుకోవాలన్నారు.  
జన్మభూమి ప్రత్యేకాధికారి గోపీనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జన్మభూమి  నాలుగో రోజు  రైతాంగ సంక్షేమం , ఆహార భద్రత , ప్రకృతి సేద్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులను , చంద్రన్న సంక్రాంతి కానుకలను లబ్దిదారులకు పంపిణీ చేశారు.        అంతకు ముందు రూ.15 లక్షలతో నిర్మించిన అంతర్గత రోడ్లు, కాలువలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఆర్డీవో వేంకటేశ్వర్లు, గొర్రెల పెంపకం సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర యాదవ్,  ఎంపిడివో, తహసీల్దార్, అన్ని శాఖల మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts