పొలిటికల్ ఫైర్ బ్రాండ్, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న ఆయన జగన్ ని మిత్రుడిగా చేసుకోవడానికి సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై రాజకీయ శ్రేణుల్లో వాడి వేడి చర్చ నడుస్తోంది. వైసీపీలో వెళ్లే ఆలోచనలో ఉండి ఇలా అన్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. జేసీ ఎప్పుడు ఎలా మాట్లాడతారో అంతుబట్టని విషయం. ఏ నోటితో అయితే పొగుడుతారో అదే నోటితో తిడతారు. ఆయన వ్యవహారశైలి ఎప్పుడు ఒక సందేహాన్ని అయితే తొలుస్తూ ఉంటుంది. ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటో వారి నోటితోనే సెలవిస్తే డౌట్స్ క్లారిఫై అవుతుంది. మరి ఆయన ఎప్పుడు బయటపడతారో చూడాలి.