కర్నూలు:
ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో జిల్లా అధికారులందరు పాల్గొననున్నారని, తాను కూడా ఏదో ఒకటి , రెండు మండలాల్లో పాల్గొంటున్నందున మీ కోసం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆ ప్రకటనలో వారు కోరారు..