Highlights
- కేసీఆర్ కు తనయుల గ్రీటింగ్స్..
- ‘హ్యాపీ బర్త్ డే డాడ్..
- హ్యాపీ బర్త్ డే డియర్ ఫాదర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 64 వ పుట్టినరోజు సందర్భంగా అయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కె. తారక రామారావు, ఆదిలాబాద్ ఏంపీ కె. కవిత లు తమదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ట్విట్టర్ వేదికగా నిలిచింది.
‘హ్యాపీ బర్త్ డే డాడ్..మంచి ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంతున్నాం’ అని కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు. అంటే కాకుండా కేటీఆర్ తన తండ్రిపై అద్భుతమైన కవితను జత చేస్తూ ట్వీట్ చేశారు.
హ్యాపీ బర్త్ డే డియర్ ఫాదర్.. మీ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్విస్తున్నాను. మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం’ అంటూ కవిత కేసీఆర్ ఫొటోతో ట్వీట్ పెట్టారు.