YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నన్ను ఆర్ధిక నేరగాడిగా ప్రకటించొద్దు : నీరవ్

నన్ను ఆర్ధిక నేరగాడిగా ప్రకటించొద్దు : నీరవ్

డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బ్యాంకులకు టోకరా వేసి 13 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయాడు. కానీ ఇలా చేయడం తప్పు కాదంటున్నారు. అవన్నీ పౌర లావాదేవీలట. పైగా గోరంతలు కొండంతలు చేస్తున్నారట. ఇదంతా ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పరారీరో ఉన్న ఆర్థికనేరస్థుడుగా ప్రకటించే విషయమై జరుగుతున్న విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టుకు మోదీ తరఫున ఆయన న్యాయవాది ఆ అఫిడవిట్‌ను సమర్పించారు. మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి బ్యాంకులకు టోపీ పెట్టారని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మోదీ లండన్‌కు, మెహుల్ చోక్సీ కరీబియన్ దేశమైన యాంటిగువా-బార్బుడోస్‌కు పారిపోయారు. రెండు దేశాలకు భారత్ అప్పగింత విజ్ఞాపనలను పంపింది. కొత్తగా తెచ్చిన ఆర్థికనేరాల చట్టం కింద మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడుగా ప్రకటించిన కేంద్రసంస్థలు ఇప్పుడు మోదీపై దృష్టి నిలిపాయి. కానీ తనను పరారీలో ఉన్న ఆర్థికనేరస్థుడుగా ప్రకటించరాదని మోదీ తన అఫిడవిట్‌లో విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల రీత్యా తాను భారత్‌కు రాలేకపోతున్నానని తెలిపారు

Related Posts