ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో నలుగురు యువకులు ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి హల్‌చల్ చేశారు. విద్యుత్ వైరు తగలడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కాగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ నలుగురు యువకులు రైలు పైకి ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? మద్యం మత్తులో ఇలా చేశారా? లేక ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మిగతా ముగ్గుర్ని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.