వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇవాళ ప్రకటించింది. ప్రవేశ పరీక్షలను మే నెలలోనే నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ను రూపొందించారు. మే 3నుంచి9వరకు ఎంసెట్, మే 11న టీఎస్ ఈసెట్, 20న టీఎస్ పీఈసెట్, 23,24వ తేదీల్లో టీఎస్ ఐసెట్, 26న టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ 27 నుంచి 29వరకు టీఎస్ పీజీ ఈసెట్, మే 30,31 తేదీల్లో టీఎస్ ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి.