Highlights
- బ్యాంకు నియంత్రణ వ్యవస్థపై నిఘా
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకు నియంత్రణ వ్యవస్థలను అధీనంలోకి తీసుకున్నామని, వాటన్నింటినీ పరిశీలిస్తు్న్నామని తెలిపింది. ముంబైలోని పీఎన్‌బీ శాఖలో 11,400 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంకు తాను తీసుకోబోయే చర్యలపై స్పందించింది. ఓ ప్రకటనను జారీ చేసింది. అంతర్గత వ్యవస్థల వైఫల్యం వల్లే బ్యాంకులోని ఇద్దరు ముగ్గురు సిబ్బంది నిర్వాకం వల్ల బ్యాంకుల నిర్వహణే గందరగోళంలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇతర బ్యాంకులకు దీటుగా లెటర్ ఆఫ్ అండర్‌టేకంగ్ (ఎల్‌వోయూ)ల లక్ష్యాన్ని నిర్దేశిస్తూ పీఎన్‌బీకి ఆదేశాలు జారీ చేశారన్న కథనాలను ఆర్బీఐ కొట్టిపారేసింది.