గుంటూరు జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనుల కోసం ప్రముఖ నేత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని తెనాలి మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఒక్కసారిగా పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. రంగా విగ్రహం తొలగించారని తెలుసుకున్న అభిమానులు, కాపునాడు నేతలు భారీగా అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ‘జై రంగా.. జైజై రంగా’ ‘విగ్రహం కదిలిస్తే ప్రాణాలు ఇస్తాం’ అని నినాదాలు చేశారు. కాగా, ఈ విషయమై మున్సిపల్ అధికారులు, నేతలు ఎవరూ ఇంకా స్పందించలేదు.