YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

పంజాబ్‌లో బి.హెచ్.ఇ.ఎల్ హైడ్రో యూనిట్

Highlights

  • 18 మెగావాట్ల ముకిరియన్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టు
  • గత ఏడాది మే నెలలో మొదటి యూనిట్
  • తక్కువ కర్బన అభివృద్ధి బాట
పంజాబ్‌లో బి.హెచ్.ఇ.ఎల్ హైడ్రో యూనిట్

పంజాబ్‌లో హోషియార్‌పూర్ జిల్లాలో ముకిరియన్ కాలువపై నెలకొల్పిన  18 మెగావాట్ల ముకిరియన్ జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు పనిచేయడం ప్రారంభించింది. శుక్రవారం ఈ విషయాన్ని విద్యుత్ సామగ్రి తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బి.హెచ్.ఇ.ఎల్) వెల్లడించింది. తొమ్మిది మెగావాట్ల రెండవ జల విద్యుదుత్పాదన యూనిట్ పని చేయడం ప్రారంభించడంతో 18 మెగావాట్ల ముకిరియన్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టుని బి.హెచ్.ఇ.ఎల్ విజయువంతంగా పూర్తి చేసినట్లయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టు  గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, దేశానికి తక్కువ కర్బన అభివృద్ధి బాటను సాధించిపెడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టులోని మొదటి యూనిట్ గత ఏడాది మే నెలలో పనిచేయడం మొదలెట్టింది.

Related Posts