YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

60 రూపాయిలకు పెట్రోల్... కేంద్రం కొత్త ఆలోచన

60 రూపాయిలకు పెట్రోల్... కేంద్రం కొత్త ఆలోచన
 పెట్రో మంట తగ్గించేందుకు బీజేపీ కసరత్తులు తీవ్రం చేసింది.  పెట్రో ఉత్పత్తుల పేరుతో ప్రజలకు వల వేయాలని చూస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించి సామాన్యుల మనసు దోచుకోవాలని మోడీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ ధరలను ఇటీవలే సుమారు 15 రూపాయల వరకు తగ్గించిన మోదీ కొంత నియంత్రణ పాటిస్తున్నారు. 2018 అక్టోబర్ లో ఇదే పెట్రోల్ రూ.84కు చేరువై ఆల్ టైం హైయ్యెస్ట్ రేటుకు చేరింది. దీంతో బీజేపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.ఈ క్రమంలో ఇప్పుడు.. ఆ తప్పును దిద్దుకొని ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు మోదీ. ఈ మేరకు పెట్రోల్ 60 రూపాయలకే సామాన్యులకు అందుబాటులో తేవడానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం పెట్రోల్ లో మిథనాల్ మిశ్రమాన్ని 10 నుంచి 15శాతానికి కలిపి ధరలను నియంత్రించాలని యోచిస్తున్నారు. దీనివల్ల ధరలు తగ్గుతాయి. దీనిపై ఉన్నతస్థాయి సమావేశానికి మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మిథనాల్ ఎక్కువగా కలిపిన ఈ పెట్రోల్ అమ్మడానికి పెట్రోల్ బంకులన్నింటిని ఆధునీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ భారాన్ని చమురు సంస్థలే మోయాల్సి ఉంటుంది.ఒక్కో పెట్రోల్ బంక్ కు మిథనాల్ పెట్రోల్ ఆధునీకరణ చేసేందుకు 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందట. ఈ నిధులను చమురు కంపెనీలే భరించాల్సి ఉంటుంది. దీంతో బంకు యజమానులందరూ దీనికి ఒప్పుకుంటారా? అలా ఆధునీకరిస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే నీతి అయోగ్ మాత్రం ఈ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి చేస్తామని ధీమాగా చెబుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే మిథనాల్ మిశ్రమ పెట్రోల్ రూ.60కే అందుబాటులోకి వస్తుంది. ఎన్నికల వేళ దీన్ని చూపించి ఓట్లు రాబట్టుకునేందుకు మోదీకి అవకాశం చిక్కుతుంది. మోదీ వేస్తున్న ఈ వల ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.

Related Posts