YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం దిశగా అడుగులు

 అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం దిశగా అడుగులు
అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు ముందుగా విడుదల చేసి రూ.5వేలు, అంతకంటే తక్కువ మొత్తం డిపాజిట్‌ చేసిన వారికి ఈ నెలలోనే చెల్లింపులు జరపనుంది. కోర్టు స్వాధీనంలో ఉన్న ఆస్తులు కాకుండా సీఐడీ కొత్తగా అటాచ్‌ చేసిన ఆస్తుల్ని ప్రభుత్వం తన స్వాధీనంలో ఉంచుకుని ఈ నిధుల్ని విడుదల చేస్తుంది. వాటి విలువ రూ.300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇప్పటికే కోర్టు స్వాధీనంలో ఉన్న ఆస్తుల వేలం ప్రక్రియలోనూ ప్రభుత్వం పాల్గొంటుంది. వేలంలో ఆ ఆస్తుల్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే నిర్దేశించిన కనీస ధరను కోర్టుకు చెల్లించి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది.అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాట సంఘంతో కలిసి ఈ ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సంయుక్త అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల ఎనిమిదో తేదీలోగా కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. ‘నెల రోజుల్లోగా కోర్టు ద్వారా ఆస్తులన్నీ వేలం వేసేలా చూసి డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ చేస్తాం. అర్హులైన డిపాజిటర్ల జాబితాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించాం’ అని పేర్కొన్నారు. రూ.5వేలు, అంతకంటే తక్కువ మొత్తం డిపాజిట్‌ చేసినవారు సుమారు 5 లక్షల మంది వరకూ ఉంటారని, ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేస్తే వారందరికీ చెల్లింపులు జరపవచ్చని కుటుంబరావు పేర్కొన్నారు.బాధితుల్లో రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసినవారు 80 శాతం ఉంటారని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అగ్రి గోల్డ్‌ ఆస్తుల విలువ రూ.35వేల కోట్లుంటే... దానిలో 10 శాతం రూ.3500 కోట్లు జగనే చెల్లించి వాటిని తీసుకోవచ్చు కదా’ అని వ్యాఖ్యానించారు. సమస్యను నాన్చాలని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే చెప్పారని తెలిపారు.

Related Posts