ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అందుకే ఏపీపై ప్రధాని నరేంద్ర మోడీ అసూయ పెంచుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అయన మాట్లాడారు. కేంద్రం అడుగడుగునా కక్ష సాధిస్తున్నాదని విమర్శించారు. రాష్ట్ర పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతున్నారని అయన విమర్శించారు. ఏపీకి దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు వచ్చాయని అన్నారు. అందుకే ప్రధాని మోదీకి అసూయ, అక్కసు కలుగుతోందని వ్యాఖ్యానించారు. మోడీ నిందల్లో నైరాశ్యం కనిపిస్తోందన్నారు. హుందాతనం వదిలేసి మోడీ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నా కుటుంబంపైనా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మోడీ చెప్పడానికి చేసిందేమీ లేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. చివరకు గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటంపై కూడా ప్రధాని అక్కసు పెట్టుకున్నారని విమర్శించారు. . గణతంత్ర దినోత్సవానికి ఏపీ శకటం లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ కక్షసాధింపునకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇది వివక్షేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.