లోక్‌సభ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ నలుగురు ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. తెదేపాకు చెందిన చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్‌తో పాటు ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలు పి.వేణుగోపాల్, కె.ఎన్. రామచంద్రన్, కె.గోపాల్‌పై సస్పెన్షన్ విధించారు. రెండురోజుల పాటు సభాకార్యక్రమాలకు హాజరుకాకుండా స్పీకర్ వారిపై వేటు వేశారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ తెదేపా ఎంపీ శివప్రసాద్, కావేరీ జలాల అంశంలో తమకు న్యాయం చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.