ప్రజలతో నేరుగా మాట్లాడే ధైర్యం ప్రధాని మోదికి లేదు. జనం నిరసనలకు భయపడి గుంటూరు పర్యటన రద్దు చేసుకున్నారు. దొడ్డిదారిన కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ల డ్రామా ఆడుతున్నారు. రాష్ట్రానికి రావడానికి ముఖం చెల్లకే ఈ డ్రామాలు ఆడుతున్నారు. రాఫెల్ కుంభకోణంపై నుంచి దృష్టి మళ్లించాలని మోది ఎత్తుగడ అని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రూ.43వేల కోట్ల రాఫెల్ స్కామ్ పై మోది మౌనం వెనుక మతలబు ఏమిటి? అవినీతి రహిత రాష్ట్రాలలో ఏపి 3వ స్థానంలో ఉంది.అవినీతి రాష్ట్రాల జాబితాలో 19వ స్థానంలో ఉంది. మీ గుజరాత్ ఏ స్థానంలో ఉంది..? బిజెపి పాలిత రాష్ట్రాలు ఏస్థానంలో ఉన్నాయని అయన ప్రశ్నించారు. వాటిగురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ అవినీతి అనడం హాస్యాస్పదం. ఫ్రాన్స్ అధ్యక్షుడే మోది అవినీతి గురించి చెప్పారు. రాఫెల్ అవినీతి గురించి మోది మాట్లాడాలి. ఎన్టీఆర్ పేరెత్తే యోగ్యత మోదికి లేదు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హ త మోదికి లేదు. ‘‘సన్ రైజ్ స్టేట్ ’’ అనేదానికి కూడా వక్రభాష్యాలు తీశారు. సూర్యోదయ రాష్ట్రంపై నరేంద్ర మోది అపహాస్యం. బిజెపి నీచ ధోరణికి ఇదే తార్కాణం. నిధులు ఇవ్వకుండా ఏపిని దొంగదెబ్బ తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మనుగడ దెబ్బతీసేందుకే మోది కుట్రలు.
నరేగాలో గతంలో రూ.1,300కోట్లు బకాయి పెట్టారు. ఇప్పుడు మరో రూ.1,200కోట్లు ఇవ్వాలి. పోలవరానికి ఇంకా రూ.3,500కోట్లు ఇవ్వాలి. తొలిఏడాది ఆర్ధికలోటుకు ఇంకా రూ.12వేల కోట్లు ఇవ్వాలి. ప్రధానిగా నరేంద్రమోది ఘోరంగా విఫలం అయ్యారు. 5రాష్ట్రాలలో చిత్తుగా ఓడించడమే మోది వైఫల్యానికి నిదర్శనం. భయపడుతోంది నరేంద్ర మోది యే..? అభద్రతలో ఉంది నరేంద్రమోది నే..? అసహనం కనిపిస్తోంది మోది లోనేనని అన్నారు. అసహనంతోనే చంద్రబాబు కుటుంబంపై మోది వ్యాఖ్యలు. ప్రధాని మోది వ్యాఖ్యల్లోనే భయం,అభద్రత,అసహనం. నల్లధనం విదేశాలనుంచి తేలేక పోయారు. ఆర్ధిక నేరగాళ్లను రెడ్ కార్పెట్ తో విదేశాలకు పంపారు. రాష్ట్రాలలో ప్రభుత్వాలను అస్థిరపరచాలని కుట్రలు. కేరళలో మత విద్వేషాలు రెచ్చగొట్టారు. ఉత్తరప్రదేశ్ లో తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపిని వెనక్కి నెట్టాలని చూస్తోంది మోది యే..గుజరాత్ ను మించిపోతుందనే ఆంధ్రప్రదేశ్ పై కక్ష అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడుగుడుగునా మోది ఆటంకాలు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు వెనక్కి నెడితే 670పైగా అవార్డులు ఎలా వచ్చాయి..? రూ.24వేల కోట్ల రుణమాఫీ రైతులకు చేయడం వెనక్కి నెట్టడమా..? పరిశ్రమలు,పెట్టుబడులు రాబట్టడం వెనక్కి నెట్టడమా...? యువతకు 10లక్షల ఉద్యోగాలు కల్పించడం వెనక్కి నెట్టడమా..? 8లక్షల పంటకుంటలు తవ్వడం వెనక్కి నెట్టడమా..? 36లక్షల మరుగుదొడ్లు కట్టడం వెనక్కినెట్టడమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడాదికి ఒక్కో జిల్లాకు ఇచ్చింది రూ.50కోట్లు మాత్రమే. రూ.23వేల కోట్లు అడిగితే మోది ఇచ్చింది రూ.1,050కోట్లు. ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకున్న చరిత్ర మోది ది. అవినీతిపై పుస్తకాలను అవినీతిపరులే వేస్తున్నారు. అవినీతి కేసులలో కోర్టుల చుట్టూ తిరిగేవాళ్లే అవినీతిపై పుస్తకాలు వేయడమా..? అవినీతి కేసులలో జైలుకు వెళ్లినవారే అవినీతిపై పుస్తకాలు వేయడమా..? దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని మండిపడ్డారు. కెసిఆర్ మంచిమాటలు మాట్లాడారని జగన్ కితాబిస్తున్నారు. కెసిఆర్ ను స్వాగతించాలని చెబుతున్నారు. వైసిపి కార్యకర్తలు సహజంగానే టిఆర్ ఎస్ కు ఓటేశారని చెప్పారు.వైసిపి, టిఆర్ ఎస్ లాలూచికి ఇంతకన్నా రుజువేం కావాలి? దుష్టశక్తులన్నీ టిడిపికి వ్యతిరేకంగా ఏకం అయ్యాయి. ఏపి ప్రజలే ఈ దుష్టశక్తులకు తగిన గుణపాఠం చెబుతారని అయన అన్నారు.